18-03-2025 01:30:21 AM
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, మార్చ్ 17 (విజయ క్రాంతి) : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాంతాల్లో ముఖ్యంగా గంజాయి, దేశిదారు, అక్రమ మద్యం రవాణా పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం బేల మండలం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా ఎస్పీ ఎస్త్స్ర దివ్యభారతి సిబ్బందితో కలిసి జిల్లా స్వాగతం పలకగా, పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించిన జిల్లా ఎస్పీ మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనా పరిశీలించిన కేసులో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారుల ఫిర్యాదులపై పక్కాగా దర్యాప్తు జరిపి తగిన న్యాయం త్వరగా చే కూరే విధంగా కృషి చేయాలి.
పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర తో సరిహద్దులో ఉన్నందుకు అసాంఘి క కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. ఎస్పీ వెంట డిఎస్పి జీవన్ రెడ్డి, సిఐ లు ఫణిధర్, సాయినాథ్, ఎస్త్స్ర లు దివ్యభారతి, ముజాహిద్ సిబ్బంది పాల్గొన్నారు.