calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

10-04-2025 12:26:07 AM

మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్9 (విజ యక్రాంతి): మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆ శాఖ జిల్లా అధికారి నదీమ్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్,వార్డెన్ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల పెంపు కృషి చేయా లన్నారు. పిఎంసి పథకం కింద చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నదీమ్ ను ప్రిన్సిపళ్లు, వార్డెన్‌లు సాలువాతో సన్మానించారు.

రాజీవ్ యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని డిఎండబ్ల్యూఓ అబ్దుల్ నదీమ్ ప్రకట నలో తెలిపారు. ఈ పథకంలో 50 వేల విలువ గల యూనిట్లకు 100% రాయితీ, 1 లక్ష రూపాయల విలువగల యూనిట్లకు 90% రాయితీ, 2 లక్షల విలువగల యూనిట్లకు 80% రాయితీ, 2 లక్షల నుండి 4 లక్ష ల విలువ గల యూనిట్లకు 70% రాయితీని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించబడుతుందని తెలిపారు.అర్హులైన వారు సంబంధిత మండలాలలోనీ ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తులు అందజేసి లబ్ధి పొందాలని సూచించారు.