calender_icon.png 18 April, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

26-03-2025 12:51:32 AM

పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం, మార్చి 25(విజయక్రాంతి):-పోలీస్ కాన్ఫరెన్స్ హలో పోలీస్ అధికారులతో మంగళవారం జరిగిన నేర సమీక్ష సమావేశంలోపోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్,పోక్సో కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్‌కి కమిషనర్ సునీల్ దత్ అన్నా రు.

సత్వర పరిష్కారం, సక్రమ విచారణ కోసం సంబంధిత దర్యాప్తు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా  పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిభందనలకు విరుద్ధంగా నిర్వహించే అక్రమ రవాణాలను పూర్తిగా కట్టడి చేయాలని అన్నారు.

బెట్టింగ్,లోన్ యాప్ కార్యకలాపాలపై పూర్తిగా నిఘాను పెంచాలని, బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం వస్తే చాలు వెంటనే దాడులు చేయా లని ఆదేశించారు.సమావేశంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్,ట్రైనీ ఐపిఎస్ అధికారి సాయి రిత్విక్, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, రహెమాన్, రఘు, వేంకటేశ్, సాంబరాజు, రవి, సర్వర్,శ్రీనివాసులు పాల్గొన్నారు.