calender_icon.png 25 April, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

25-04-2025 12:00:00 AM

కేసుల ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేయాలి

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి): పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగ తిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని  జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్‌లో నిర్వహించిన నెలవారు నేర సమీక్షా కార్యక్రమంలో  పాల్గొని మాట్లాడుతూ పోలీసులు తమ విధుల పట్ల అత్యంత బాధ్యతలో పని చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు  గం జాయి, జూదం, పీడీయస్ బియ్యం అక్ర మ రవాణా, అక్రమ పశువుల రవాణా, నకిలీ పత్తి విత్తనాల సరఫరా  లాంటి వాటిపై ప్రత్యే క దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నేర పరిశోధనలో టెక్నాలజీ ఉప యోగిస్తూ క్వాలిటీతో పాటు పారదర్శకత ఉండేలా చూడాలన్నారు.

పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలలో ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విధులులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన  పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్‌కి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు  ఎస్పీ ఆర్.ప్రభాకర రావు, ఆసిఫాబాద్ ఎ.ఎస్.పి చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్, జిల్లాలోని సీఐలు, ఆర్.ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.