calender_icon.png 20 January, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

20-01-2025 06:06:22 PM

ప్రధానోపాధ్యాయులు నాదేశించిన పిఓ రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సెలవులు వినియోగించుకొని, తిరిగి వారి వారి పాఠశాలలకు చేరుకునే గిరిజన విద్యార్థిని, విద్యార్థులు చలికాలం వాతావరణం మార్పు వలన అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున, పిల్లల యొక్క మానసిక స్థితిగతులను సంబంధిత హెచ్ఎం, వార్డెన్ గమనించి వారికి తప్పనిసరిగా వైద్య చికిత్సలు చేయించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. సోమవారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరములో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి గిరిజన దర్బార్ లో వివిధ సమస్యల గురించి అర్జీలు సమర్పించడానికి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

గిరిజనులు సమర్పించిన అర్జీలలో పోడు భూముల సమస్యలు, పోడు భూముల పట్టాల కొరకు, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాల కొరకు, వ్యవసాయ భూములకు కరెంటు మోటార్లు ఇప్పించుట కొరకు, గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవన భృతి కల్పించుట కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుట కొరకు, కులాంతర వివాహం ప్రోత్సాహకం ఇప్పించుట కొరకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు అర్జీలు సమర్పించారని ఆయన అన్నారు. ములకలపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు బోరు, మోటారు, కరెంటు ఇప్పించుట కొరకు, టేకులపల్లి మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ పోడు భూములలో విద్యుత్ లైన్ కల్పించుట కొరకు, గుండాల మండలం దామరతోగు గ్రామానికి చెందిన రవి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇప్పించుట కొరకు, అశ్వరావుపేట మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన రామయ్య, 12 మంది గిరిజనులు తమ పొలాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన దేవా తమ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, సింగరేణి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన సంగీత సోలార్ విద్యుత్ ప్లాంట్ ఇప్పించుట కొరకు, అన్నపురెడ్డిపల్లి మండలంకు చెందిన చిన్నయ్య దేవస్థానం భూములకు సంబంధించిన కౌలు ఇప్పించుట గురించి దరఖాస్తులు పెట్టుకున్నారని ఆయన అన్నారు. 

గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదుతో పాటు ఆన్లైన్ చేయించి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతలవారీగా సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఆర్సిఓ గురుకులం నాగార్జునరావు, ఏవో సున్నం రాంబాబు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఏపీవో పవర్ వేణు, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, డిఎస్ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ అనసూయ, ఏపీ డి ఓ అశోక్ కుమార్, ఎల్ టి ఆర్ డి టి మనిధర్, మిషన్ భగీరథ ఏ ఈ ఈ నారాయణ రావు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది జోగారావు, మమత, నవ్య తదితరులు పాల్గొన్నారు.