- మాజీ ప్రధాని మన్మోహన్‌కు నివాళి అర్పించనున్న అసెంబ్లీ
- 30న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించిన నేపథ్యంలో 30న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయి దా పడింది. సంతాపదినాల్లో భాగంగా మాజీ ప్రధానికి నివాళులర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు శనివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పంపించారు. క్యాబినెట్ భేటీ వాయిదాపడిన నేపథ్యంలో, తిరిగి దానిని ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వం తెలుపలేదు. రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ విధివిధానాలు, భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సాయం, కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర కీలక అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.