calender_icon.png 31 October, 2024 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు

31-10-2024 01:31:57 AM

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): దీపావళి సందర్భంగా ఏర్పడిన ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జనరల్ బోగీ ప్రయాణికుల రద్దీపై ప్రత్యే క దృష్టి సారించి, క్యూ లైన్లను ఏర్పా ట్లు చేయడంతోపాటు ప్రయాణీకులు సజావుగా రైలెక్కేలా అన్నీ చర్య లు తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఏ శ్రీధర్ తెలిపారు. 

సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లతో పాటు అన్ని ప్రధాన స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, టిక్కెట్ చెకింగ్ సిబ్బందిని పటిష్ఠం చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 60 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బంది, 20 మంది టిక్కెట్ చెకింగ్ సిబ్బందిని షిఫ్టుల వారీగా నియమించి ప్రయాణికులకు మార్గనిర్ధేశం చేసేందుకు 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు.