calender_icon.png 11 March, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలి ఉద్యోగుల సత్వర ఆరోగ్య సేవలకు ప్రత్యేక యాప్..

10-03-2025 11:11:41 PM

ప్రారంభించిన ఎండీ అశోక్ రెడ్డి..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): జలమండలి ఉద్యోగులకు సత్వర ఆరోగ్య సేవల కోసం ప్రత్యేక యాప్ రూపొందించడం హర్షణీయమని ఆ సంస్థ ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. జలమండలి పరిధిలో హెల్త్ కార్డు ఉన్నవాళ్లకు ఆరోగ్య సేవల్ని మరింత సులభతరం చేసేందుకు మెడ్ ఫ్లాష్ అనే మొబైల్ అప్లికేషన్‌ను ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ఉద్యోగులు ఈ యాప్ ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ యాప్ వినియోగం గురించి డివిజన్లలో ఆరోగ్య సేవలకు సంబంధించిన పనిచేసే వాళ్లకు.. ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

హెల్త్ కార్డు ఉన్న ఉద్యోగులకు సత్వర ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. మెడికల్ ఎమర్జెన్సీలో ఈ యాప్ ఉపయోగించి సేవల్ని పొందవచ్చని చెప్పారు. యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటే ఏజెన్సీ వాళ్లు వెంటనే స్పందించి.. ఆరోగ్య వివరాలు, మంచి వైద్యం అందించే ఆసుపత్రులను కూడా సూచిస్తారని పేర్కొన్నారు. అవసరమైతే.. అంబులెన్స్ ను కూడా ఇంటి దగ్గరకు పంపించే సౌకర్యాన్నీ కల్పించారు. హెల్త్ కార్డులు ఉన్న ఉద్యోగులకు ఇలాంటి క్యాష్ లెస్ సర్వీస్ అందించడం దేశంలోనే మొదటి సారి కావడం విశేషం.

జలమండలిలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్స్ దాదాపు 6685 మందికి హెల్త్ కార్డులు ఉన్నారు. దీని ద్వారా సంవత్సరానికి రూ.3 లక్షల వరకు ఉచిత సేవలను పొందవచ్చు. కార్యక్రమంలో ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్-2 వీఎల్. ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ. శ్రీధర్, పీ అండ్ ఏ సీజీఎం మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ప్రావిడెన్స్ ఇండియా ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెండ్ జ్యోతి బాల, తదితరులు పాల్గొన్నారు.                       

లీకేజీ పునరుద్ధరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి.. 

ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి.. 

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): మొఘల్ రెస్టారెంట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ లీకేజీ పునరుద్ధరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఎండీ అశోక్ రెడ్డి జలమండలి అధికారులతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరమ్మతుల పనులపై ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌మిషన్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు.

మరమ్మతులును సమీక్షించాలని జలమండలి ఈడీకి ఎండీ సూచించారు. ఈమేరకు ఈడీ మయాంక్ మిట్టల్ మరమ్మతులను క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు పూర్తిచేసి నీటి సరఫరా పునరుద్ధరణ చేయడానికి అవసరమైతే మరిన్ని గ్యాంగ్ లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఈడీ ఆదేశించారు. పనులను వేగవంతం చేయడానికి మైక్రో లెవల్లో ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.