calender_icon.png 1 February, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభ్యున్నతికి ప్రత్యేక కేటాయింపులు

01-02-2025 01:05:09 AM

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క  

హైదరాబాద్, జనవరి 31(విజయక్రాంతి): మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహి ళా కళాశాలలో శుక్రవారం జరిగిన కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

మహిళా విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదని తెలిపారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నదన్నారు. స్వ యం సహాయక సంఘ సభ్యులతో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి కార్యాచరణ ప్రారంభించామని వెల్లడించారు.

గ్రామీణ ప్రాం తాల్లో నిరుపేదల కుటుంబాలకు చెందిన పిల్లలకు కార్పొరేట్‌స్థాయి విద్యనందించేందుకు ఒక్కో స్కూల్‌ను రూ.200 కోట్ల వ్యయంతో 20- 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 60 స్కూళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు.

మహాలక్ష్మి పథకం ద్వా రా మహిళలు, బాలికలు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని వివరించారు. వారి కి సంబంధించిన వడ్డీని రాష్ట్ర ఆర్థికశాఖే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.