calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి కోసం ప్రత్యేక కార్యాచరణ

17-04-2025 12:56:15 AM

- ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి

 - రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ 

- ఓ ఆర్ ఆర్ పరిధిలోని మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: వేసవిలో ప్రజలకు తాగు నీటి సమస్య రాకుండా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

తాగునీటి సమస్యలపై మున్సిపల్ కమిషనర్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్ అండ్ బి అధికారులతో కలిసి ఆమె బుధవారం మధ్యాహ్నం బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ కార్యాలయం కిస్మత్ పూర్ లో ఓ ఆర్ ఆర్ పరిధిలోని  మునిసిపాలిటీలు అయిన బండ్లగూడ జాగీర్, శంషాబాద్, మణికొండ, నార్సింగి, తుక్కుగూడ, జల్ పల్లి, ఆదిభట్ల, బడంగ్ పేట్, మీర్పేట్, పెద్ద అంబర్ పేట, తుర్కయంజాల్ మున్సిపాలిటీల  కమిషనర్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్ అండ్ బి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించడానికి వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాలలో అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేయాలని ఆదేశాలు జారీచేశారు. నిధుల విషయం, ఇతర సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కరిస్తానన్నారు.

ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, అదేవిధంగా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్ అండ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.  సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లో శరత్ చంద్ర, సుమన్ రావు, కృష్ణమోహన్ రెడ్డి, పాల్గొన్నారు.