calender_icon.png 5 April, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్య

05-04-2025 01:58:06 AM

-  ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

 సదాశివపేట,ఏప్రిల్ 4:  సదాశివపేట పట్టణతో పాటు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పట్టణంలోని పలు వార్డులకు తాగునీరు అందించడంలో మున్సిపల్ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అధికారులు స్పష్టం చేశారు.తాగు  నీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  దృష్టికి తీసుకు రాగానే తక్షణం స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హామీ ఇచ్చారు.