calender_icon.png 6 March, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తబితకు స్పీకర్ పరామర్శ

06-03-2025 12:00:00 AM

వికారాబాద్, మార్చ్- 5: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో  విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసిన సంఘటనలో విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం  విద్యార్ధిని తబిత చికిత్స నిమిత్తం ఆటోలో ఆసుపత్రికి వెలుతుండగా మార్గమధ్యలో  ఆటో ఆపి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  పరమార్శించారు. సంఘటన పూర్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

స్పీకర్ ప్రసాద్ కుమార్  విద్యార్ధినికి దైర్యం తెలపడంతో పాటు,విచారణ చేయించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.సంఘటన జరిగిన రోజు వెంటనే స్థానిక నాయకులను కొత్తగడి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వద్దకు పంపి గాయపడిన విద్యార్ధిని తబితకు అవసరమైన వైద్య సహాయం అందించాల్సిందిగా  ఆదేశాలు జారీ చేయడంతో, పాటుగా విద్యార్ధిని తబితతో స్వయంగా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వెంట వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ ఉన్నారు.