మలక్‌పేట్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : తిరుమల బ్యాంకు(Tirumala Bank) ఖాతాదారులకు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) అన్నారు. తిరుమల బ్యాంక్ 2025 సంవత్సర నూతన క్యాలెండర్, డైరీని స్పీకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ... ఖాతాదారులు నమ్మకాన్ని కల్పించడం ద్వారానే బ్యాంకులో మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు. వినియోగదారుల కోసం మెరుగైన బ్యాంకింగ్ సేవలు భవిష్యత్తులో అందించాలని కోరారు. ఖాతాదారులకు నమ్మకమైన సేవలను అందిస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్నామని త్వరలోనే సంతోష్ నగర్ లో మరో బ్రాంచ్ ని ప్రారంభిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్(Table Tennis Player Naina Jaiswal), శ్రీనివాస్ స్వామీజీ, జిఎం శోభనాద్రి, శర్మ, బ్యాంకు ఇన్ చార్జి రవిశంకర్, బ్యాంకు డైరెక్టర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు.