న్యూఢిల్లీ,(విజయక్రాంతి): భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా పార్లమెంట్ లో రాజ్యాంగం వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ... రాజ్యాంగం దినోత్సవం జరుపుకుంటున్న కోట్లాది భారతీయులకు అభినందనలు తెలిపారు. 75 ఏళ్ల క్రింతం ఈ పవిత్ర ప్రదేశంలోనే రాజ్యాంగం ఆమోదం పొందిందన్నారు.
దేశమంతా ఐక్యంగా రాజ్యాంగం దినోత్సవాలు జరుపుకుంటోందని, దేశ పౌరులు రాజ్యాంగం పీఠిక సామూహిక పఠన సంకల్పం తీసుకోవాలని ఓంబిర్లా పేర్కొన్నారు. ప్రధాని ప్రేరణతో 2015 నుంచి ఏటా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు., దార్శినికుల త్యాగాలు, శ్రమ ఫలితంగా, దేశ భౌగోళిక, సామాజిక పరిస్థితులు ఆధారంగా వివిధ వర్గాల అభిప్రాయాలు, చర్చల అనంతరం రాజ్యాంగం రూపకల్పన జరిగి అమల్లోకి వచ్చిందని స్పీకర్ ఓంబిర్లా గుర్తు చేశారు.