calender_icon.png 25 March, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్యాదగా మాట్లాడాలి!

23-03-2025 12:49:17 AM

హరీశ్‌రావు.. ఇదేనా నేర్పుతున్నది

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): మంత్రి సీతక్క ప్రభుత్వ భవంతి లోనే ఉంటున్నారని, అలాంటిది ఆమె పట్ల అమర్యాదగా మాట్లాడటం సరకాదని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు.. ఇదే నా నేర్పుతున్నదంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మంత్రి సీరియస్ అయ్యారు.

అందరిలాగానే మంత్రి క్వార్టర్స్‌లో ఉం టున్నారని, మరి నువ్వు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉండట్లేదా అని ప్రశ్నించారు. దీని పై వివరణ ఇవ్వాలని కౌశిక్‌రెడ్డిని సూచించారు.  బీజేపీ ఎమ్మెల్యే ్ల వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలతో వచ్చే గన్‌మెన్లు, డ్రైవర్లకు వసతులు కల్పించాలని కోరారు. మంత్రి  స్పం దిస్తూ.. ఆ అభ్యర్థనను పరిశీలిస్తామన్నారు.