calender_icon.png 15 November, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవాలు మాట్లాడండి

14-11-2024 01:01:55 AM

జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

  1. రుణమాఫీ చేయనోళ్లా మాట్లాడేది?
  2. హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ 

కరీంనగర్, నవంబర్ 13 (విజయక్రాంతి): అధికారంలో ఉండి రూ.లక్ష రుణ మాఫీ కూడా చేయనోళ్లు మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధ్వజమెత్తారు. బుధవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడారు. తెలంగాణను అప్పుల ఊబిలో దించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడతల వారీగా రూ.లక్ష కూడా మాఫీ చేయని విషయాన్ని గ్రహించాలన్నారు.

తమ ప్రభుత్వం రైతాంగానికి ఏక మొత్తంగా రూ.18వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు. అదానీ, అంబానీ లాంటి వారికి రూ.లక్షల కోట్లు మాఫీ చేశారు కానీ.. రైతుల విషయంలో వెనుకడుగు వేశారని దుయ్యబట్టారు. పాదయాత్ర సమయంలో హరీశ్‌రావు జిల్లాపై విమర్శలు చేశారని, తమ ప్రభుత్వం జగిత్యాలను రోల్‌మోడల్‌గా నిలిపిందన్నారు.

ఇప్పటివరకు 30,625 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని.. మీరు చేయలేని పని మేం చేస్తుంటే విమర్శించడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేయడం సహజం కానీ.. వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నడిచే చక్కెర కర్మాగారాన్ని మూసివేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మూసి ప్రక్షాళనకు సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారన్నారు.

కరోనా వేళ రూ.వేలకోట్లు దండుకున్న హరీశ్‌రావు పాదయాత్రలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు. ఇప్పటి వరకు మేం చేసింది తక్కువే.. ఇంకా 70 ఎంఎం సినిమా చూపిస్తామని అడ్లూరి హెచ్చరించారు.