13-03-2025 12:42:51 AM
స్పేరోస్ రాష్ట్ర కన్వీనర్ ఛాతళ్ల సదానందం
హనుమకొండ, మార్చి 12 ( విజయ క్రాంతి): ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్పేరోస్ అన్ని రంగాల్లో స్వయంకృషితో రాణించాలని స్పేరోస్ రాష్ట్ర కన్వీనర్ చాతళ్ల సదానందం పిలుపు నిచ్చారు. బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ప్రాంతం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ దీక్ష వాల్ పోస్టర్ను స్పేరోస్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ జ్ఞానం కోసమే భీమ్ దీక్ష అని అన్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు జ్ఞానం కోసం నిర్వహించే భీమ్ దీక్షల లో స్పేరోస్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో స్పేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ పుల్లా కిష న్, స్పేరోస్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు అమ్మఒడి సుభద్ర శ్యామల, మారపల్లి మనోజ్, ఒంటేరు చక్రీ, శనిగరపు శ్రీనివాస్, బొల్లారం రమాకాంత్, శనిగరపు రాజేంద్రప్రసాద్, అమ్మఒడి శ్రీనివాస్, శనిగరపు సాజన్, కలకోటి సునిల్, పెండెల మహేందర్,దుప్పటి ఫౌల్, సృజన విజ్ఞానవతి, విద్యారాణి, విజ య్ తదితరులు పాల్గొన్నారు.