calender_icon.png 10 January, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో రఫేల్ నాదల్

20-07-2024 06:16:04 PM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ స్వీడీష్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో నాదల్ 6 (2/7), 7 7 మారియానో నవోనే (అర్జెంటీనా)ను మట్టికరిపించాడు. రెండు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో టై బ్రేక్‌లో తొలి సెట్ కోల్పోయిన నాదల్.. రెండు, మూడు సెట్లలో ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు.

ఇక సెమీస్‌లో నాదల్ క్రొయేషియాకు చెందిన డ్యుకోవిక్‌తో తలపడనున్నాడు. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ సెమీస్ చేరిన నాదల్‌ల.. కాస్పర్ రూడ్ (డెన్మార్క్)తో కలిసి బ్రెజిల్ జంట లుజ్‌న అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇక ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగనున్న నాదల్.. డబుల్స్ విభాగంలో సహచర ఆటగాడు కార్లోస్ అల్కరాజ్‌తో కలిసి ఆడనున్నాడు.