డస్సెల్‌డోర్ఫ్: యూరో కప్‌లో స్పెయిన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హాట్రిక్ విజయాలతో స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గ్రూప్ మంగళవారం అల్బానియాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 1 విజయాన్ని అందుకుంది. స్పెయిన్ తరపున ఫెర్రన్ టోరెస్ (ఆట 13వ నిమిషంలో) గోల్ సాధించాడు. అనంతరం ఇరుజట్లు మరో గోల్ చేయడంలో విఫలం కావడంతో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఇదే గ్రూప్‌లో క్రొయేషియా, ఇటలీ మ్యాచ్ 1 డ్రాగా ముగిసింది.
క్రొయేషియా తరపున లూకా మొడ్రిక్ (ఆట 55వ ని.లో) గోల్ చేసి క్రొయేషియాను 1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే ఇటలీ తరపున మాటియా జకాగ్ని (90+8వ ని.లో) గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. సమయం ముగిసేలోపూ ఇరుజట్లు సమంగా నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇటలీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక డ్రా, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్స్ చేరగా.. క్రొయేషియా, అల్బానియా ఇంటిదారి పట్టాయి.