calender_icon.png 24 January, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెయిన్ హ్యాట్రిక్

02-07-2024 12:05:00 AM

కొలోన్ (జర్మనీ): యూరో కప్‌లో స్పెయిన్ హ్యాట్రిక్ విజయాలతో ఎదురులేకుండా దూసుకెళ్తోంది. సోమవారం గ్రూప్ స్పెయిన్ 4 జార్జియాను మట్టికరిపించి గ్రూప్ టాపర్‌గా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. స్పెయిన్ తరపున రోడ్రీ (ఆట 39వ నిమిషంలో), ఫాబియన్ రూయిజ్ (51వ నిమిషంలో), నికో విలియమ్స్ (75వ ని.లో), డాని ఒల్మో (83వ ని.లో) గోల్స్ సాధించారు. జార్జియా తరపున రాబిన్ లీ నార్మండ్ (18వ ని.లో) జట్టుకు ఏకైక గోల్ అందించాడు. ఇదే గ్రూప్ నుంచి స్పెయిన్‌తో పాటు ఇటలీ క్వార్టర్స్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో శుక్రవారం జర్మనీతో స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనుంది.