calender_icon.png 14 January, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 మీటర్ల సమీపానికి స్పేడెక్స్ శాటిలైట్లు

13-01-2025 01:08:33 AM

* ఆ తర్వాత సురక్షితంగా దూరం

న్యూఢిల్లీ, జనవరి 12: నింగిలో డాకింగ్ ప్రక్రియను విజయవంత ంగా చేపట్టేందుకు ప్రయోగించిన స్పే డెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపంలోకి చేరుకున్నట్లు ఇస్రో ప్రకటిం చింది. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తాజాగా వీటిని 15 మీటర్ల సమీపానికి తీసుకొచ్చి.. ఆపై 3 మీటర్లకు ఈ దూరాన్ని తగ్గించింది.

తర్వాత తిరిగి రెండింటినీ సురక్షితమైన దూరానికి పంపినట్టు పే ర్కొంది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. అంతకు ముందు స్పేడెక్స్ ఉపగ్రహాల చిత్రాలను కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున 3.10లకు వీటిని 105 మీటర్ల దగ్గరికి చేర్చారు.