- నాలుగో దేశంగా భారత్ రికార్డు
- మానవసహిత అంతరిక్ష యాత్ర చంద్రయాన్
- సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి ముందడుగు
- వాయిదాలు పడ్డా.. లక్ష్యం చేరిన శాస్త్రవేత్తలు
- అభినందనలు తెలిపిన ప్రముఖులు
- ఇస్రో సిగలో మరో నగ
న్యూఢిల్లీ, జనవరి 16: ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. గతేడాది డిసెంబర్ 30న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన స్పేడెక్స్ మిషన్‌లో కీలకఘట్టమైన డాకింగ్‌ను పూర్తి చేసింది. డాకింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన దేశాల జాబితాలోకి భారత్ చేరిపోయింది. డాకింగ్ ప్రక్రియ పలుసార్లు వాయిదా పడినా చివరికి విజయవంతమయింది. ఈ మిషన్ ద్వారా నింగిలోకి పంపిన చేజర్, టార్గెట్ అనే రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేయడంతో ఈ ప్రక్రియ పూర్తుంది.
వాయిదాలు పడ్డా..
పీఎస్‌ఎల్‌వీ-సీ60 ద్వారా డిసెంబర్ 30న నింగిలోకి దూసుకెళ్లిన స్పేడెక్స్ మిషన్‌లో ఉన్న రెండు ఉపగ్రహాలు చేజర్, టార్గెట్‌లను డాకింగ్ చేసేందుకు జనవరి 7 నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అనేక కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదాపడుతూ వచ్చింది. పలు కారణాల వల్ల వాయిదా పడిన ప్రతిసారి ప్రతి ఒక్కరికీ ఈ మిషన్ సక్సెస్ మీద అనేక అనుమానాలు కలిగాయి. అసలు మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అని చాలా మంది కంగారుప డ్డారు.
భారత్ భవిష్యత్‌లో స్పేస్ టెక్నాలజీలో చక్రం తిప్పేందుకు ఈ మిషన్ విజయవంతమవడం చాలా కీలకం. వాయిదాలు పడ్డా.. అంతా కంగారు పడ్డా కానీ శాస్త్రవేత్తలు ఏ మాత్రం విశ్వాసం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో గురువారం డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. తద్వారా ఇటువంటి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన నాలుగో దేశంగా అవతరించింది.
ఇస్రో హర్షం..
ఒక్కోటి 220 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలను స్పేడెక్స్ మిషన్ ద్వారా నింగిలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలు.. మొదట ఆ రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చి డాకింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తునట్లు ఇస్రో సోషల్ మీడియా లో ప్రకటించింది. ఇస్రో ప్రకటనతో యావత్ దేశం ఆనందంలో మునిగిపో యింది. ఈ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు రేయింబవళ్లు కృషి చేసిన శాస్త్రవేత్తల బృందానికి ఇస్రో ధన్యవాదాలు తెలిపింది.
4వ దేశంగా భారత్
డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంతో భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో మూడంటే మూడు దేశాలు మాత్ర మే డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఇస్రో ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు యూఎస్, రష్యా, చైనా మాత్రమే ఈ తరహా ప్రయోగాల్లో విజయవంతం అయ్యాయి.
భవిష్యత్‌కు రూట్ క్లియర్
స్పేడెక్స్ మిషన్ విజయవంతం మీద చాలా ప్రయోగాల భవిష్యత్ ఆధారపడి ఉం ది. మానవసహిత అంతరిక్ష యాత్ర చంద్రయాన్-4, సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రయోగాలు ఈ మిషన్‌తో ముడిపడి ఉన్నాయి. అందుకోసమే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ మిషన్ విజయ వంతం కోసం ఎంతో ఆరాటపడ్డారు. ఈ విజయంతో ఇస్రో మరిన్ని కొత్త ప్రయోగాలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధం అవు తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇస్రో చరిత్ర సృష్టించింది
స్పేడెక్స్ మిషన్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఇస్రో చరిత్ర సృష్టించింది. స్పేస్ డాకింగ్ కేపబు లిటీని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. భారత్ భవిష్య త్‌లో చేపట్టబోయే కీలక అంతరిక్ష ప్రయోగాలకు ఈ విజయం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మిషన్ విజయవంతానికి కృషి చేసిన ఇస్రోలో ని ప్రతిఒక్క శాస్త్రవేత్తకు అభినందనలు.
ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి
ఇది కీలకమెట్టు
డాకింగ్ ప్రక్రియను విజయ వంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్ర వేత్తలకు అభినందన లు. రాబోయే సంవత్స రాల్లో భారత్ చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాలకు ఈ విజయం కీలకమెట్టుగా మారనుంది.
నరేంద్ర మోదీ, ప్రధాని