13-03-2025 01:52:02 AM
ఎమ్మెల్యేకు ఆర్టిఏ మెంబర్ శ్రీనివాస్ వినతి
జగిత్యాల అర్బన్, మార్చి 12 (విజయక్రాంతి): జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్’కు ఆర్టిఏ మెంబర్ కమటాల శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం ఎమ్మెల్యేను కలిసిన శ్రీనివాస్ జగిత్యాలలో రవాణాశాఖ కార్యాలయ సొంత భవనం లేక కార్యాలయ సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు.
సిబ్బందికి విధి నిర్వహణలో ఏర్పడుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో 10 ఎకరాల ఆటోమేటిక్ టెస్టింగ్ ఫిట్నెస్ స్టేషన్, సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ వెహికల్ సీజర్ యార్డ్’లకు స్థలం కేటాయించాలని కోరారు. ఆయన వెంట నాయకులు ఆడువాల లక్ష్మణ్, గంగాధర్ తదితరులున్నారు.