calender_icon.png 25 October, 2024 | 4:00 AM

స్పేస్ జర్నీ @ 1.17 కోట్లు

25-10-2024 01:43:19 AM

సబ్ ఆర్బిటల్  ఫ్లుటైలో ప్రయాణం

వెల్లడించిన డీప్ బ్లూ ఏరోస్పేస్

బీజింగ్, అక్టోబర్ 24: అంతరిక్ష ప్రయాణం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి చైనా దేశానికి చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ శుభవార్త చెప్పింది. స్పేస్‌లోకి తాము రెండు సీట్లు ఉన్న రాకెట్‌ను 2027లో పంపుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి దీనిలో రెండు సీట్లు మాత్రమే ఉంటాయని తెలిపింది. వాటి టికెట్ల ధరలను రూ.1.77 కోట్లుగా నిర్ణయించినట్లు పేర్కొంది. గురువారం సాయంత్రం నుంచి 6 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఆసక్తి ఉన్న ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోవాలని వెల్లడించింది. ప్రయాణికులను సబ్ ఆర్బిటల్ ఫ్లుటైలో భూ వాతావారణాన్ని దాటి, అంతరిక్షం అంచుల వరకు తీసుకెళ్లి తిరిగి క్షేమంగా తీసుకువస్తామని తెలిపింది. డిమాండ్ ఉంటే వచ్చే నెలలో మరిన్ని టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. మరోవైపు 2028 నాటికి అంతరిక్ష ప్రయా ణ విమానాలను ప్రారంభిస్తామని చైనాకు చెందిన సీఏఎస్ పేర్కొంది. దీనితో పాటు మరికొన్ని కంపెనీలు కూడా అంతరిక్ష పర్యాటక రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించాయి.