calender_icon.png 1 April, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీ యోగేష్ గౌతమ్

27-03-2025 12:52:29 AM

నారాయణపేట. మార్చి 26(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా కేంద్రంలోని జామా మసీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...  ముస్లింలు జరుపుకునే పండుగలలో అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ పంగడ అని నెల రోజులపాటు ఉపవాస దీక్షలతో ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు అని అన్నారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తు  రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

నారాయణపేట జిల్లా ప్రజలంతా కులా మతాలకతీతంగా తమ పండుగలను సోదర భావంతో జరుపుకోవాలని ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లింగయ్య, సిఐ  శివ శంకర్, తఖి చాంద్,అమీరోద్ధిన్, దస్థగిరి చాంద్, తఖీ,ముస్లిం మత పెద్దలు  తదితరులు పాల్గొన్నారు.