calender_icon.png 16 January, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక నిమజ్జనంలో డ్యాన్స్ చేసిన ఎస్పీ

11-09-2024 02:13:04 AM

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ తోటి ఉద్యోగులతో కలిసి చిందేశారు. నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని మంగళవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో షేర్‌బ్యాండ్ ముందు డ్యాన్స్ ఎస్పీ వేశారు. కాగా ఊరేగింపులో డీజేలు వాడి ఇతరులకు ఇబ్బంది కలిగించడం సరైనవిధానం కాదని ఆయన పేర్కొన్నారు. షేర్‌బ్యాండ్ చప్పుళ్లతో నిర్వహించిన ఊరేగింపులో ఎప్పీ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.