calender_icon.png 18 March, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్నూర్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ

17-03-2025 08:28:15 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సోమవారం ప్రారంభించారు. అలాగే మద్నూర్ పిట్లం స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పలు రికార్డులను తిరిగేశారు. అలాగే కేసుల వివరాలను ఎస్ఐ మోహన్ రెడ్డిని మద్నూర్ ఎస్సై  విజయ్ కొండను అడిగి తెలుసుకున్నారు. రికార్డులలో సమాచారం ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. వెంట బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ సీఐ జగడం నరేష్ ఉన్నారు.