నాగర్‌కర్నూల్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): బైక్ అదుపుతప్పి ఎస్పీ వాహన డ్రైవర్ మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం లో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపురం గ్రామానికి చెంది న రామస్వామి సాగర్ (45) జిల్లా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ వాహన డ్రైవరుగా పనిచేస్తున్నాడు. మంగళవారం తన ఇంటికి పోలీస్ స్టేషన్ వెనకాల నుంచి బైక్‌పై సామ గ్రి తీసుకెళ్తుండగా.. ఎదురుగా కారు, బైకు అడ్డురావడంతో తప్పించబో యి పక్కనే విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. కిందపడటంతో తీవ్ర గాయా లై అక్కడికక్కడే మృతిచెందాడు.