కామారెడ్డి,(విజయక్రాంతి): సంక్రాంతి సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు,నగదు,బంగారు ఆభరణాలు ఉంచకూడదని జిల్లా ఎస్పీ సింధూశర్మ(SP Sindhu Sharma) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీరువా తాళం చెవులు బీరువా బట్టల కింద ఇంట్లో పెట్టి వెళ్లవద్దని తెలిపారు. ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయటకు గొల్లెం పెట్టకండి అని తెలిపారు. ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచి బయటకు వెళ్లేటప్పుడు బయట లైట్లు వేసి ఉంచాలని తెలిపారు. ఊరికి వెళ్లిన తరువాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటుండాలి. ఇంటివాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని, వీలు అయితే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిదన్నారు. సీసీ కెమారాలను కాలనీల్లో ఏర్పాటు చేసుకుంటే దొంగలు బయపడే అవకాశం ఉంటుందన్నారు.ఇంటి సమీపంలో అనుమానితులు కనబడితే టోల్ ప్రీ నెంబర్ 100కు గానీ, పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712686133 వాటాప్స్ నెంబర్ కు సమాచారం ఇచ్చిన సరే లేక డయల్ చేసిన అందుబాటులో పోలీస్ సిబ్బంది ఉంటారని తెలిపారు.సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను జిల్లా ప్రజలకు ఎస్పీ సింధుశర్మ తెలిపారు.