వనపర్తి టౌన్, ఫిబ్రవరి 3:- ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన 11 మంది భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.భాధితుల సమస్యల సత్వర పరిష్కారా నికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.