calender_icon.png 12 March, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

12-03-2025 04:49:39 PM

జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు నేరాలు అరికట్టడానికి పోలీసులు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా గాంధారి బాన్సువాడ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు కోసం వచ్చే వారికి  గౌరవం ఇచ్చి వారి పిటిషన్లను తీసుకొని పరిశీలించాలన్నారు. బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణను డివిజన్లో పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు. ఆయనతోపాటు బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.