calender_icon.png 22 April, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

21-04-2025 08:48:40 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్, లింగంపేట్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రికార్డ్ గదులు, రైటర్ రూమ్‌, పాత క్వార్టర్స్ లను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించడంతో పాటు, రిసెప్షన్ వద్ద ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, బాధితులకు త్వరిత పరిష్కారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఎఫ్ఐఆర్ నమోదు నుండి చార్జిషీట్ దాఖలు వరకు ప్రతి దశలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

పోలీస్ స్టేషన్ రికార్డులు నవీకరించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విసిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి రోడ్డుప్రమాదాలు, దొంగతనాలు తగ్గించాలన్నారు. 100 నెంబరుకు వచ్చిన కాల్స్‌కు వెంటనే స్పందించాలన్నారు. సైబర్ మోసాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. యువత ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లలో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, నాగిరెడ్డిపేట ఎస్ఎచ్ఒ మల్లారెడ్డి, లింగంపేట్ ఎస్ఎచ్ఒ వెంకటరావు, సిబ్బంది  పాల్గొన్నారు.