calender_icon.png 28 March, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

21-03-2025 04:39:03 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పోలీస్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం దోమకొండ(Domakonda) మండలంలోని గ్రామాలు జనాభా క్రైమ్ రేట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతనంగా వీధుల్లోకి చేరిన పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.... నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు ఏ విధంగా విధులు నిర్వహించాల్లో వారికి సూచించారు. ఆయన వెంట సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ డీ.స్రవంతి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.