11-03-2025 08:13:31 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఎస్పీ రాజేష్ చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసులు పెండింగ్ లో లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించి, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట సిఐ సంపత్ కుమార్, ఎస్సై డి ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.