28-03-2025 12:58:21 AM
సంగారెడ్డి, మార్చి 27 (విజయ క్రాంతి): సంగారెడ్డి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలన చేసేందుకు ఎస్పి పరితోష్ పంకజ్ తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. తన మార్క్ పోలీసు వ్యవస్థలో అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీస్ స్టేషన్ లు తనిఖీ చేయడం, రికార్డులు పరిశీలించడం, క్రైమ్ వివరాలు తెలుసుకోవడం, కేసు విచారణలో చేపడుతున్న పురోగ తులను తెలుసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ లు తనిఖీ చేసి అక్కడి క్రైమ్ రేటు, పరిసరాలను, రికార్డుల నమోదు వివరాలు పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణా తో పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశాలు ఇస్తున్నారు. జిల్లా ఎస్పి తనదైన శైలిలో పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసి అధికారులకు నేరాలు నివారించేందుకు ఆదేశాలిస్తున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేస్తున్నారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతకు చర్య..
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24స7 ప్రజలకు అందుబాటులో పోలీసులు ఉంటారని ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్స్ కదిలికల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్‌కు ఫిర్యా దు చేసేందుకు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికతో విని సమస్య పరిష్కారం చేయాలని సూచిస్తున్నారు. సివిల్ తగాదాలు పోలీసులు ఎవరు తల దూర్చకూడదని ఆదేశాలు ఇచ్చారు.
పోలీస్ స్టేషన్ రికార్డుల పరిశీలన
సంగారెడ్డి జిల్లా లోని జోగిపేట్, సదాశివపేట, సంగారెడ్డి రూరల్, పటాన్ చెరు, అమీన్ పూర్, బొల్లారం, మనూర్, నాగల్ గిద్ద, తో పాటు పలు పోలీస్ స్టేషన్ లు తనిఖీ చేసి పెండింగ్ కేసుల పైలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులతో పాటు కేసు విచారణలో నిర్లక్ష్యం చేయకుండా పూర్తి వివరాలు సేకరించాలని ఆదే శాలిస్తున్నారు.
నేరస్తులకు శిక్షపడే విధంగా సాక్ష్యాలు ఉండాలని సూచనలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్తాచెదారం లేకుండా పచ్చదనంతో ఉండాలని ఆదేశించారు. నేరాలు నివారించేందుకు పోలీసులకు పలు సూచనలు సలహాలు అందిస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
పటాన్ చెరు ప్రాంతం హైదరాబాద్ సిటీకి సమీపంలో ఉండడంతో ట్రాఫిక్ ని యంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ట్రాఫి క్ ఇబ్బందులు లేకుండా ప్రధాన రోడ్ల పై సిగ్నల్స్ ఏర్పాటు తో పాటు, ప్రధాన చౌరస్తాలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడంతో పాటు బోలారడ్స్ వేయించాలని.
ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలు వివరించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచనలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో నేరాలు నివారించేందుకు తనదైన శైలిలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.