12-03-2025 09:34:15 PM
పోలీసు స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడాలి
పోలీసు స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడాలి
పోలీసు స్టేషన్, సర్కిల్ కార్యాలయ ఆవరణను, స్టేషన్ రికార్డుల పరిశీలన
జోగిపేట పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి: నేరాలు నివారించేందుకు తరుచూ వాహనాల తనిఖీ, నాకాబంది వంటి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి అనుమానిత వ్యక్తులను, వాహనాలను అదుపులోకి తీసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బుధవారం జోగిపేట పోలీసు స్టేషన్, సీఐ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ, కేడి, సస్పెక్ట్ లను తరుచూ చెక్ చేస్తూ, ఆన్లైన్ రికార్డులలో అప్డేట్ చేయాలన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల గురించి జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచనలు చేశారు. విధి నిర్వహణలో నిబద్దతతో ఉండాలని, కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వహించాలని అన్నారు.
స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యను ఓపికగా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. పోలీసు శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం అని, రోజు వ్యాయామం చేస్తూ ఫిట్నెస్ కాపాడుకోవాలని అన్నారు. డ్యూటి పరంగా లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలున్నా సంబంధిత అధికారుల ద్వారా నాదృష్టికి తీసుకురాలవని, సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. పోలీసు స్టేషన్, సర్కిల్ కార్యాలయ ఆవరణ, సిబ్బంది బ్యారెక్ పరిశుభ్రతను, తనిఖీ చేస్తూ, మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహిస్తామన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి, బాధితులకు అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి సీఐ. విజయ్ కృష్ణ, జోగిపేట ఎస్ హెచ్ ఓ పాండు తదితరులు ఉన్నారు.