18-03-2025 07:50:45 PM
మెడికో లీగల్ సర్వీస్ లతో పాటు వివిధ స్కూల్స్, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి,(విజయక్రాంతి): పోక్సో, అత్యాచార ఇతర మహిళా సంబంధిత కేసులలో బాధితులకు ధైర్యాన్ని నింపాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని ఉన్న జిల్లా భరోసా కేంద్రాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. భరోసా కార్యాలయంలో కౌన్సిలింగ్ రూమ్, మెడికల్ రూమ్, లీగల్ సపోర్ట్ రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూమ్, రికార్డ్ లను తనిఖీ చేశారు. భరోసా కేంద్రం ప్రారంభమైన నాటి నుండి పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు అందించిన సేవలను, నిర్వహించిన కౌన్సిలింగ్, భరోసా సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోక్సో, అత్యాచార ఇతర మహిళా సంభందిత కేసులలో బాధితులకు ధైర్యాన్ని నింపాల న్నారు. భాదిత మహిళను వెన్నంటి ఉండి వారికి అందించవలసిన మెడికో లీగల్ సేవలను సత్వరమే అందేలా చూడాలని తెలిపారు. అవసరమైన కేసులలో హోమ్-విజిట్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. మహిళా సంబంధిత నేరాల గురించి వివిధ స్కూల్స్, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర ఉమెన్ సేఫ్టీ అంశాల గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. భరోసా సిబ్బంది పనితీరు బాగుందని, వారు అందించిన సేవలను అభినందిస్తూ.. డ్యూటిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సమస్య ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురాలని సూచించారు. ఎస్పీ వెంట సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, భరోసా కో-ఆర్డినేటర్ దేవలక్ష్మీ, భరోసా సిబ్బంది తదితరులు ఉన్నారు.