calender_icon.png 13 March, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంప్రదాయ పద్ధతుల్లో హోలీ పండుగ జరుపుకోవాలి

13-03-2025 05:01:06 PM

సహజ సిద్ధమైన రంగులను వినియోగించాలి

మద్యం సేవించి వాహనాలు నడపరాదు, బైకులపై పెద్ద శబ్దాలు చేస్తూ గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు..

లోతట్టు ప్రదేశాలు, చెరువుల్లో ప్రాజెక్టులలో స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

రంగుల హోలీ మీ జీవితాలలో వెలుగులు నింపాలి

జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి,(విజయక్రాంతి):  ప్రజలు హోలీ పండగను సంప్రదాయ పద్ధతుల్లో, ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని న్యాచురల్ కలర్స్ ను వినియోగించి, ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్  సూచించారు.  గురువారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.  యువత మద్యం సేవించి వాహనాలను నడపడం, బహిరంగ ప్రదేశాలపై, ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడం వంటివి చేయకూడదు అన్నారు. బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అట్టి వ్యక్తులపై చట్టరిత్య చర్యలు తప్పవని  హెచ్చరించారు.

హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను తరుచూ గమనిస్తూ వారికి సరైన మార్గాలను నిర్దేశించాలన్నారు. యువత వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, రేష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, లాంటివి మానుకోవాలని సూచించారు. హోలీ పండగ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సున్నిత ప్రదేశాలలో ప్రత్యేక  బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు  వివరించారు.   ఏదైనా అత్యవసర పరిస్థితిలో 100 డయల్ చేయాలని సూచించారు.  హోలీ మీ జీవితాలలో రంగులు నింపాలని కోరుకుంటూ సిబ్బందికి, సంగారెడ్డి జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంశాలు తెలియజేశారు.