calender_icon.png 23 February, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఎస్పీ తీరు మార్చుకోవాలి

22-02-2025 07:22:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): బాసర త్రిబుల్ ఐటీలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్పీ జానకి షర్మిలను కలవడానికి వెళ్తే తమను కలవకుండ ఎస్పీ వెళ్లిపోయిందని ఏబీవీపీ ఇందూర్ శాఖ కన్వీనర్ శశిధర్(ABVP Indore Branch Convener Shashidhar) ఆరోపించారు. ఉదయం 11 గంటలకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ఒంటిగంట వరకు వేచి ఉండాలని సూచించిన ఎస్పీ తమ వినతిపత్రం సేకరించకుండానే వెళ్లిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీశ్వర్ సాత్విక్, చిన్న దినేష్ తదితరులు ఉన్నారు.