calender_icon.png 6 March, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కా నిఘా ఉంచండి: జిల్లా ఎస్పీ డి జానకి

06-03-2025 12:05:30 PM

నిఘా పక్కగా ఉంచండి 

- అనుమతి లేనిది అనుమతించకూడదు  -జిల్లా ఎస్పీ డి జానకి 

మహబూబ్ నగర్ : ఇంటర్మీడియట్ పరీక్షల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి. జానకి అన్నారు.  జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ డి. జానకి  బుధవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజ్ మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, విద్యార్థుల రాకపోకలు, బహిరంగంగా సంచరించే వ్యక్తుల నియంత్రణ, అన్‌ఆథరైజ్డ్ ప్రవేశం తదితర అంశాలను ఆమె సమీక్షించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో పోలీసు బందోబస్తును బలపరచాలని, అదనపు సిబ్బందిని మోహరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఇతర నిషేధిత వస్తువులను పరీక్షా హాల్లోకి తీసుకురాకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.

ప్రత్యేకంగా నిఘా 

 పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు,స్టాఫ్ రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ పోలీసులను చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 BNSS (144 సెక్షన్) విధించనున్నట్లు తెలిపారు. పరీక్షల సందర్భంగా తల్లిదండ్రులు కేవలం పరీక్ష కేంద్రాల వరకు మాత్రమే రావాలని, అనవసరంగా కూర్చోవడం లేదా పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడడం చేయొద్దని ఎస్పీ గారు సూచించారు. పరీక్షలు శాంతియుత వాతావరణంలో నిర్వహించే బాధ్యత పోలీస్ శాఖపై ఉంది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎవరైనా అక్రమ ప్రయత్నాలకు పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, విద్యా శాఖ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.