01-03-2025 06:48:24 PM
నిర్మల్,( విజయక్రాంతి): ప్రజల శాంతిభద్రతల కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖలో పనిచేసిన ఉద్యోగుల సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలు దేవరావు లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల పదవీ విరమణ తప్పనిసరి అయినప్పటికీ ఉద్యోగుల సేవలు మాత్రం పోలీస్ శాఖ ఎప్పుడు మర్చిపోదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు