11-04-2025 08:23:42 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే వీర హనుమాన్ విజయ యాత్ర రూట్ మ్యాప్ ను శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డిలు విశ్వహిందూ పరిషత్ నాయకులతో కలిసి పరిశీలించారు. కోడూరి హనుమాన్ టెంపుల్ నుండి బడా మజీద్, రైల్వే బ్రిడ్జి నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్ రోడ్ ధర్మశాల, సుభాష్ రోడ్ వీక్లీ మార్కెట్, పాంచ్ చౌరస్థ, రూట్ ను నడుచుకుంటూ పరిశీలించారు. వీరి వెంట ఎలక్ట్రిసిటీ అధికారులు, మునిసిపల్ అధికారులు కూడా పాల్గొన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న చెట్ల కొమ్మలు, వైర్లు తొలగించాలని మున్సిపల్, ఎలక్ట్రిసిటీ అధికారులకు ఎస్పీ తెలిపారు.
అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించి విజయయాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలని యాత్రకు తమ సహకారం పూర్తిగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ రూట్ మ్యాప్ పరిశీలించిన వారిలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, గోపాలకృష్ణ,జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ వివేకనంద అశోక్, పట్టణ అధ్యక్షుడు వడ్ల వెంకటస్వామి కార్యదర్శి వంగ ప్రసాద్, శ్రీకాంత్ రావు, పాపారావు, విశ్వం గుప్తా, మంచాల రాజు, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.