calender_icon.png 16 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల దహర్తి తీర్చేందుకే మజ్జిగ పంపిణీ

16-04-2025 11:55:45 AM

ఎస్పీ డివి శ్రీనివాసరావు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ప్రజల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎస్పి డివి శ్రీనివాసరావు(SP DV Srinivasa Rao ) తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఏ ఎస్ పి చిత్తారంజన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు వేసవి దృష్ట్యా పోలీసులు నీకోసం కార్యక్రమంలో భాగంగా మజ్జిగ పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రద్దీ ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో మాత్రమే మజ్జిగ పంపిణీ ఎండలు తగ్గేవరకు ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, వాంకిడి సిఐ లు రవీందర్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.