calender_icon.png 7 February, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనం వీడి జనంలోకి రండి-పోరు కన్నా ఊరు మిన్న

07-02-2025 05:15:40 PM

మావోయిస్టులకు ఎస్పీ డివి శ్రీనివాస్ రావు సూచన...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలని ఎస్పి డివి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పెంచికల్ పేట్ మండలం అగర్ గుడా గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకుబాయి అలియాస్ అనిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ప్రస్తుత స్థితిగతులతో పాటు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని నిత్యవసర సరుకులు దుస్తులు అందజేశారు. అనంతరం గ్రామంలో  పోరుకన్న-ఊరు మిన్న కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... అజ్ఞాతం వీడి జనంలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు చూడాలన్నారు.

ఎన్నో ఏళ్లుగా కుటుంబ సభ్యులకు, బంధువులకు దూరంగా అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు పార్టీలో పనిచేసే సాధించింది శూన్యమే అన్నారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో అనేకమంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారని గుర్తు చేశారు. ప్రజలు, యువత చెడువసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రామానుజం, కాగజ్ నగర్ రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్బి సీఐ రాణా ప్రతాప్, ఎఎస్ఐ కొమురయ్య, ఆర్ఎస్ఐ ఓదెలు తదితరులు పాల్గొన్నారు.