నల్లగొండ, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోరట్స్ మీట్-2025లో పతకాలు సాధించిన జిల్లా పోలీస్ సిబ్బందిని మంగళవారం తన కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఇదే స్పూర్తితో జాతీయస్థాయిలోనూ రాణించి జిల్లాకు పేరు తేవాలన్నారు.
కరీంనగర్లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోరట్స్ మీట్ జరిగింది. క్రీడల్లో జిల్లా పోలీస్ క్రీడాకారులు రన్నింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ డబుల్స్, వాలీబాల్, కబడ్డీ, హాకీ పోటీల్లో ప్రతిభచాటారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్‌ఐలు హరి బాబు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.