calender_icon.png 28 April, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ అనుశ్రీ..

24-04-2025 04:25:30 PM

ఇంటర్ టాపర్ కు ఎస్పీ అభినందనలు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ 2025 ప్రథమ సంవత్సర ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మాదాసు తిరుపతి కుమార్తె అనుశ్రీ ఎంపీసీ విభాగంలో 468 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచింది. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్(SP Sudheer Ramnath Kekan) శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి శ్రీనివాస్, ఆర్ ఐ లు భాస్కర్, సోములు తదితరులు పాల్గొన్నారు.