calender_icon.png 8 January, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాంపియన్ షిప్ సాధించిన క్రీడాకారున్ని అభినందించిన ఎస్పీ

07-01-2025 06:19:50 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): 11th తెలంగాణ స్టేట్ లెవెల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2025(Telangana State Level Masters Athletics Championship-2025పోటీలలో పతకాలను సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వీరభద్రంను మంగళవారం ఎస్పీ రోహిత్ రాజు(SP Rohith Raju) అభినందించారు. జనవరి 4, 5 తారీఖులలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి GMC బాలయోగి స్టేడియం నందు జరిగిన 11th తెలంగాణ స్టేట్ లెవెల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2025 పోటీలలో ఒక బంగారు, రెండు వెండి పతకాలను సాధించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వీరభద్రంను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. 50-55 సంవత్సరాల వయసు కలిగి 5Km, 1500మీటర్స్, 400 మీటర్స్ పరుగు పందెం విభాగాలలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం 1500 మీటర్ల విభాగంలో బంగారు పతకాన్ని, 5Km, 400 మీటర్ల విభాగాలలో వెండి పథకాలను సాధించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ 50 సంవత్సరాల వయసు పైబడి కూడా రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన వీరభద్రం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు తమ శారీరక సామర్థ్యాన్ని చాటుకునే విధంగా కూడా ఇలాంటి క్రీడా పోటీలలో పాల్గొని తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాలని తెలిపారు. త్వరలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో కూడా మరిన్ని పథకాలు సాధించి తనకు, పోలీసులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం వీరభద్రంను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్పీ, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు సుధాకర్, నరసింహారావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.