calender_icon.png 26 April, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

25-04-2025 05:29:57 PM

ఇల్లెందు (విజయక్రాంతి): అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) అన్నారు. శుక్రవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్‌ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. స్టేషన్ మొత్తం తనిఖీ చేసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ఇల్లెందు డివిజన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికలను పరిశీలించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల‌న్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు సూర్యం, శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.