19-03-2025 08:45:48 PM
నారాయణఖేడ్: మనుర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ పారిపోష్ పంకజ్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణ, స్టేషన్లో గల పలు రికార్డులు, కేసుల వివరాలను పరిశీలించారు. ఆయన వెంట నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై పోలీస్ సిబ్బంది ఉన్నారు.