calender_icon.png 15 March, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

15-03-2025 12:42:54 AM

జగిత్యాల, మార్చి 14 (విజయక్రాంతి): అర్థ రాత్రి వేళ అనూహ్యంగా ఆకస్మిక తనిఖీలు చేసి అటు అధికారులను, ఇటు సిబ్బందిని జగిత్యాల ఎస్పీ అశోక్’కుమార్ ఒక్కసారిగా అలర్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో  జగిత్యాల టౌన్’తో పాటు కోరుట్ల సెగ్మెంట్లోని కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్లు,  పలు ప్రాంతాల్లో ఎస్పీ ఆకస్మికంగా పర్యటించారు.

అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.  అనంతరం మెట్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేసి, జీడీ బుక్ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఊహించని రీతిలో అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేయడం ప్రత్యేకతను సంచరించుకుంది.